కంటెస్టెంట్స్ ఏడ్పించిన బిగ్ బాస్.. యష్మీకి మణికంఠ ఇచ్చిన దెబ్బ అదుర్స్ కదూ!
on Oct 5, 2024
హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఎమోషన్స్ తో నింపేశాడు బిగ్ బాస్. మొదటగా యష్మీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. ఎవరికి ఫుడ్ తీసుకెళ్తామని అనుకుంటావని అడుగగా నిఖిల్ కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత పృథ్వీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. విష్ణుప్రియ, నైనికకి వచ్చిన ఫుడ్ లో ఎవరికి తీసుకెళ్తావని అనగా.. నైనికకి తీసుకెళ్ళాడు పృథ్వీ. ఆ తర్వాత నిఖిల్ ని పిలిచి.. నబీల్, సీత, ప్రేరణ ఇంటి నుండి ఫుడ్ వచ్చిందనగానే.. ప్రేరణకి తీసుకెళ్తానని చెప్పి ఆమెకి ఇచ్చాడు.
ఇక హౌస్ లో ఒక్కొక్కరి ఇంటి నుండి మెసెజ్ వచ్చింది. వాటిని బిగ్ స్క్రీన్ మీద డిస్ ప్లే చేశాడు బిగ్ బాస్. నిఖిల్‌కి వాళ్ల అమ్మ నుంచి వచ్చిన మెసేజ్‌ను టీవీలో చూపించాడు బిగ్‌బాస్. హాయ్ నిఖిల్.. నువ్వు గెలవడానికి బీబీ హౌస్‌కి వెళ్లావు.. నీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు.. ఇతరుల కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోవద్దు.. ఎక్కువ ఎమోషనల్ అవ్వకు.. పోటీదారులతో పాటు నువ్వు కూడా రేసులో ఉన్నావ్..నువ్వు ఆడుతున్న విధానానికి కప్పు ఎప్పుడు తీసుకుంటావో అని ఎదురుచూస్తున్నా.. లవ్ యూ కంద అంటూ నిఖిల్‌కి వాళ్ల అమ్మ రాశారు. ఇది చూసి నిఖిల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మణికంఠని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. నీ ముందు యష్మీ, పృథ్వీ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఉంది ఎవరికి తీసుకెళ్తావని బిగ్‌బాస్ అడుగగా.. దీనికి క్షణం కూడా ఆలోచించకుండా నా మనసుకి పృథ్వీ అనిపిస్తుంది బిగ్‌బాస్ అంట మణికంఠ చెప్పాడు. దీంతో బయట నుండి యష్మీ చూస్తూ బోరున ఏడ్చేసుంది. ఇక మణికంఠ ఫుడ్ తీసుకొని వచ్చాడు.
మొదటగా మణికంఠకి యష్మీ నమ్మకద్రోహం చేసింది. మణికంఠ చేసిన పనికి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దెబ్బ అదుర్స్ కదూ అంటూ శివాజీ సినిమాలోని పంచ్ డైలాగ్ తో ఇన్ స్టాగ్రామ్ లో యష్మీ మీద మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. ఇక హౌస్ లో అందరి ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి కేవలం కొందరికి మాత్రమే ఇచ్చి మిగిలిన వాళ్లని ఏడిపించడమేంటో బిగ్ బాస్ మామకే తెలియాలి. ఇక నిన్నటి ఎపిసోడ్ చూసిన నబీల్ సీత, మణికంఠ అభిమానులు మాత్రం.. నీకు హార్ట్ లేదబ్బా బిగ్ బాస్ అని అనుకున్నారు.
Also Read